మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం గజేంద్ర మోక్షం అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శేషగిరిరావు, కల్యాణిలు వ్యవహరించారు. ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన తాడికొండ తిరుమలరావు, తాడికొండ సాయికుమార్‌లు వ్యవహరించారు. శనివారం స్వామి పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో రామకోటిరెడ్డి తెలిపారు.