
పూర్తయిన అదనపు తరగతి గదుల నిర్మాణం
వినుకొండ(నూజెండ్ల): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో నూతన భవనాలను నిర్మించి ఎస్సీ బాలికల విద్యకు పెద్ద పీట వేసింది. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 10 ఉండగా వినుకొండలోని బాలికల గురుకుల పాఠశాలలో రూ.కోటి నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో రూ.5 కోట్ల నిధులతో హాస్టల్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే ఇటీవల యడ్లపాడు మండలంలో రూ.21 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణంతో పాటు సత్తెనపల్లిలో మరో రూ.20 కోట్లతో నూతన భవన నిర్మాణాలను పూర్తి చేశారు. అలాగే గురజాల, కారంపూడి, నాగార్జున సాగర్, అమరావతి, అచ్చంపేట, ఉప్పలపాడు, ఆర్‌కే పురం గురుకుల పాఠశాలల్లో నాడు నేడు పనుల కింద కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్య, వసతి సౌకర్యాల్లో ఎక్కడా రాజీ పడకుండా గురుకుల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 5 వేల మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నా రు. నూతన భవన నిర్మాణాలతో పాటు గతంలో నిర్మించిన భవనాలను కూడా నాడు–నేడు పథకం కింద పాఠశాలల్లో మరుగుదొడ్లు, నూతన పెయింటింగ్స్, ఇతర వసతి సౌకర్యాలను కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు. ఎస్సీ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని పథకాలను అమ లు చేస్తున్నారు. విద్యార్థినీ విద్యార్థులకు బైజూస్ ట్యాబ్‌లు, అధునాతన లైబ్రరీల్లో పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఎస్సీ గురుకులాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
రూ.కోట్ల నిధులతో నూతన భవనాల నిర్మాణం యడ్లపాడు, సత్తెనపల్లిలో అందుబాటులోకి వచ్చిన భవన సముదాయాలు వినుకొండలో తుది దశకు చేరుకున్న హాస్టల్ అదనపు తరగతి గదుల భవనాలు
విద్యార్థులకు మెరుగైన వసతులు
నాడు–నేడు పనుల కింద కోట్ల రూపాయల నిధులతో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల యడ్లపాడు, సత్తెనపల్లిలలో నూతన భవనాలు పూర్తయి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే వినుకొండలో రూ.6 కోట్ల నిధులతో పాఠశాల అదనపు గదులు, హాస్టల్ భవ నం కూడా అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గతంలో నిర్మించిన పాఠశాలల్లో నాడు–నేడు నిధుల కింద మెరుగైన వసతులు కల్పించాం
– పద్మజ, డీసీవో

వినుకొండ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల

పూర్తయిన హాస్టల్ వసతి గృహ నిర్మాణం
