అలజడిలో జననం

Yass Cyclone: New Babies Born In Odisha - Sakshi

భువనేశ్వర్‌: ‘యాస్‌’ తుఫాన్‌ అలజడి సమయంలోనూ పలు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. బాలాసోర్, భద్రక్, జగత్‌సింగ్‌పూర్, కేంద్రాపడా జిల్లాల్లో తుపాను ముంచెత్తుతున్న తరుణంలో పలువురు గర్భిణులు  ప్రసవించారు. తల్లీబిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర సమాచార, ప్రసార విభాగం ప్రకటించింది. నెలలు నిండిన గర్భిణులను అంబులెన్సుల్లో తుఫాన్‌కు ముందుగానే ప్రసూతి కేంద్రాల్లో చేర్చిన విషయం తెలిసిందే. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలో నెలలు నిండిన 31 మంది గర్భిణుల్లో 10 మంది ప్రసవించినట్లు సమాచారం. ఇతర ప్రాంతాల సమాచారం అందాల్సి ఉంది.  

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top