రాయగడ: వేదాంత లంజిఘడ్ అల్యూమినియం ప్రాజెక్టు నుంచి భారీ మొత్తంలో అల్యూమిన పౌడర్‌ను అక్రమంగా తరలిస్తూ ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్న పెద్ద రాకెట్‌ను జిల్లాలోని మునిగుడ పోలీసులు బట్టబయలు చేశారు. సోమవారం రాత్రి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిర్వహించిన దాడుల్లో అల్యూమినియం లోడ్‌తో వెళ్తున్న 7 పికప్ వ్యాన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అందుకు సంబంధించి ఆ వాహనాల్లో గల ఏడుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగి తెలిపిన వివరాల ప్రకారం వేదంత అల్యూమిన ప్రాజెక్టు నుంచి చోరీ చేసిన అల్యూమిన పౌ డర్‌ను పికప్ వాహనాల్లో లోడ్ చేసి రాష్ట్రం బయటకు తరలిస్తున్న సమయంలో పోలీసులు వ్యూహం ప్రకారం వాహనాలను పట్టుకున్నారు. ఈ రవాణా చేస్తున్న డ్రైవర్లను కోర్టుకు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు.


