పర్లాకిమిడి: మహేంద్రగిరిలో మహేంద్రమేళా ఘనంగా జరుగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బిభూతీ జెన్నా మంగళవారం మధ్యాహ్నం మేళాను సందర్శించారు. మంత్రి బిభూతీ జెన్నాకు కాశీ సుమేధుపీఠాధిపతి జగద్గురు సరస్వతీ స్వామి, నరేంద్ర సరస్వతీ మహారాజ్, స్వామి హారిహార మహారాజ్, స్వామి భాస్కర తీర్ధ సరస్వతీ గౌరవంగా స్వాగతించారు. అనంతరం మహారాజ్ తదితరులును స్వాగతించారు. సనాఽతన ధర్మం, విశ్వశాంతి మహాయజ్ఞం జరుపుతున్న పండితుల వద్దకు మంత్రి పలకరించారు. అనంతరం ఆయన కుంతీ మందిరానికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకున్నారు. మహేంద్రగిరి ఆధ్యాత్మిక చింతనకు, భక్తి, ధ్యానం, శాంతి, శాశ్వత సంస్కృతి, దివ్యవైభవంతో ప్రకాశిస్తున్నదని, మహేంద్రుని అనంత కృపతోఈ ఆధ్యాత్మిక మహోత్సవం విజయవంతం కావాలని మంత్రి బిభూతీ జెన్నా ఆకాంక్షించారు. ప్రపంచంలో శాంతి, సద్భావన, ఆధఆ్యత్మిక చైతన్యం సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి జెన్నా అన్నారు. అనంతరం మంత్రి ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రిసార్టుకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఆయన వెంట గజపతి జిల్లా ఎస్‌డీసీ చైర్మన్ కామదేవ్ బోడోనాయక్ ఉన్నారు.
సందర్శించిన మంత్రి బిభూతీ జెన్నా


