మల్కన్‌గిరిలో మామిడి మేళా ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మల్కన్‌గిరిలో మామిడి మేళా ప్రారంభం

Jun 3 2026 12:45 AM | Updated on Jun 3 2026 12:45 AM

మల్కన్‌గిరిలో మామిడి మేళా ప్రారంభం

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని పాత మెడికల్‌ కళాశాల మైదానం మామిడిపండ్ల మేళాను మంగళవారం ప్రారంభమైంది. జిల్లా పరిపాలన, ఓర్మాస్‌ సంయుక్త ఆధ్వర్యంలో మేళాను నిర్వహిస్తున్నారు.మల్కన్‌గిరి గిరిజన రుతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల పర్యవేక్షణలో ఈ నెల ఐదో తేదీ వరకు నిర్వహించనున్న మేళాను జిల్లా అదనపు కలెక్టర్‌ వెద్బ్‌ర్‌ ప్రధాన్‌ ప్రారంభించారు. మేళాలో 20 రకాల మామిడి పండ్లను విక్రయాల కోసం రైతులు తీసుకొచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలు మామిడితో చేసిన వివిధ రకాల పానియాలను విక్రయిస్తున్నారు. మామిడి పానకం, మ్యాంగో షేక్‌ ప్రత్యేక అకర్షణగా నిలిచింది. మేళా ప్రారంభ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, ఓర్మాస్‌ కార్యనిర్వహక అధికారి స్వస్తికా ప్రధన్‌, వ్యాపారులు జితేంధ్ర కుమార్‌ పాత్రో, అమిత్‌ కుమార్‌, అధికారులు మమతా మహాపాత్రో, శ్యామ్‌ ముదిలి, జిల్లా పరిషత్‌ కార్యాలయ అధికారులు బాలాజీ పట్నాయక్‌, మానాస్‌ మిశ్రో, హిమాన్షు మహరాణా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement