కూలిన జిప్సం సీలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కూలిన జిప్సం సీలింగ్‌

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
ప్రభుత్వాస్పత్రి గదిలో

పర్లాకిమిడి: స్థానిక కేంద్రప్రభుత్వ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డు రూంలో జిప్సం సీలింగ్‌ కూలిన సంఘటనలో తృటిలో పేషెంటు తప్పించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వార్డు నంబర్‌ 3లో సముటియా వీధికి చెందిన భభశ్రీ హాలధర్‌ చిన్న సర్జరీ నిమిత్తం డి.హెచ్‌.హెచ్‌.కి వచ్చింది. అయితే సర్జరీ అయిన తర్వాత ఆమెను ఎమర్జెన్సీ వార్డు నంబర్‌ 63 గదిలోకి మార్చారు. పెషెంటు భభశ్రీ అనుకోకుండా బాత్‌రూంకు వెళ్లి వచ్చేలోగా ఫాల్స్‌సీలింగ్‌ అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే తృటిలో ఆమె తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆమె భర్త తెలియజేశారు. ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో ఈ సంఘటన జరిగి చాలా సమయం అయినా జిల్లా ముఖ్య చికిత్సాధికారి గానీ అదనపు జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌ గాని సంఘటనా స్థలానికి రాకపోవడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఇటీవల పర్లాకిమిడి డి.హెచ్‌.హెచ్‌.పై పబ్లిక్‌ అనేకసార్లు రాష్ట్రమంత్రులు, సెక్రటరీల వద్ద ప్రశ్నించినా ఇలాంటి సంఘటనలు జరగటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుత సీడీఎంఓ డాక్టర్‌ సంతును పాఢి పదవీ బాధ్యతలు చేపట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనేక సమస్యలకు దారి తీస్తోంది. ప్రభుత్వం కొత్తగా నియమించిన సి.డి.యం.ఓ డాక్టర్‌ మంజురాణి జెన్నా ఇంతవరకూ విధుల్లో జాయిన్‌ కాలేదని ఏడీఎంఓ మహాపాత్రో తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement