విక్రమదేవ్‌ వర్సిటీలో ముగిసిన బీఈడీ వర్క్‌షాప్‌ | - | Sakshi
Sakshi News home page

విక్రమదేవ్‌ వర్సిటీలో ముగిసిన బీఈడీ వర్క్‌షాప్‌

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

జయపురం: స్థానిక విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయంలో 12 రోజులుగా నిర్వహించిన బీఈడీ ముగిసింది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)ఆధ్వర్యంలో వర్సిటీ ఉపాధ్యాయ విద్యా విభాగం ప్రాంగణంలో బీఈడీ కోఆర్డినేటర్‌, విద్యా విభాగఅధిపతి డాక్టర్‌ మనోరంజన ప్రధాన్‌ అధ్యక్షతన వర్క్‌షాపు జరిగింది. కార్యక్రమంలో వికర్మ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్‌ హృషికేష్‌ శనాపతి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వర్క్‌షాపులో నేర్చుకున్న విషయాలను పాఠశాల స్థాయిలో అమలు చేయటంతో పాటు జాతీయ విద్యావిధానం 2020లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని హితవు పలికారు. గౌరవ అతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ మహేశ్వర చంద్ర నాయిక్‌ వర్క్‌ షాపులో తరగతుల తీరు, విద్యార్థుల అనుభవాలను విని సంతోషం వ్యక్తం చేశారు. ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచివచ్చిన ప్రతినిధులను అభినందించారు. గౌరవ అతిధిగా ఇగ్నో రీజనల్‌ డైరెక్టరేట్‌ ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ లలిత మిశ్ర వర్క్‌షాప్‌ ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ ఉజ్వళ కుమార్‌ షొడంగి బీఈడీ విద్యార్థులకు పరీక్షకులకు సంబంధించి పలు సూచనలు చేశారు. శిక్షణ శిబిరంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి మొత్తం 56 మంది హాజరై ఉపాధ్యాయ వృత్తిపై అవగాహన కల్పి్‌ంచుకున్నారు. పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement