● ఇద్దరు వ్యక్తులు అరెస్టు
రాయగడ: జిల్లాలోని మునిగుడ పోలీసులు తాగునీటి పైపుల దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి 80 ఇనుప పైపులతో సహ మినీ వ్యాన్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిలో కలహండి జిల్లాకు చెందిన పరిమిల్ బిశి, మిధున్ రాణాల ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని డంగసొరడ, హనుమంత్‌పూర్, బిసంకటక్, అంబొదల, చంద్రపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాగునీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ స్టాకు గమనించి ఒక పథకం ప్రకారం చోరీ చేస్తున్నారు. బుధవారం రాత్రి తుముడిబొంధొ, భవాణీపట్నం రహదారి గుండా పైపులను పశ్చిమ బెంగాల్ తరలించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో పోలీసులు దాడి చేసి డంగసొరడ వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. మునిగుడ ఐఐసీ కేశవ్ షడంగీ నేతృత్వంలొ ఈ దాడులు చేపట్టారు.


