ఉత్సవం అదిరింది..
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లొ ఆదివారం నుంచి కొనసాగుతున్న ఇడితాల్ ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరో ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. కళాకారులను ప్రోత్సాహించడంతో పాటు ఆదివాసీల భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఇడితాల్ పేరిట ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. లంజియా సవర తెగకు చెందిన ఆదివాసీల కళారంగానికి ప్రతీకగా నిలిచే ఇడితాల్ చిత్రపటాన్ని ఈ సందర్భంగా గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ గిరిధర్ గొమాంగోకు అందించి సన్మానించారు. కళారంగంలో గొమాంగో హిడెన్ టాలెంట్ పేరిట ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన గిరిధర్ గొమాంగో కళారంగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని సబ్ కలెక్టర్ దిల్లిప్ కొనియాడారు. అనంతరం వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా అదనపు కలక్టర్ నిహారి రంజన్ కుహరో ప్రారంభించారు. కార్యక్రమంలొ గుణుపూర్ ఎంఎల్‌ఏ సత్యజీత్ గొమాంగో, మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివగౌడో పాల్గొన్నారు.
ఉత్సవం అదిరింది..
ఉత్సవం అదిరింది..
ఉత్సవం అదిరింది..
ఉత్సవం అదిరింది..


