పెరగనున్న చలి తీవ్రత
భువనేశ్వర్: రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి వాయువ్య దిశ నుంచి పొడి.. చల్లని గాలుల ప్రవాహం పెరగడం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో పశ్చిమ గాలుల ఉపసంహరణ ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రత తగ్గుతోందని భువనేశ్వర్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది.
ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సేవా సమాజ్ సమీపంలోని మైదానంలో ఇడితాల్ పేరిట నిర్వహిస్తున్న చొయితీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. నర్మదా సాహు, కుడేశ్వరి నాయక్, సౌదామిణి గొమాంగొ తొలి మూడు స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.
గోదాదేవికి విశేష పూజలు
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా సోమవారం గోదాదేవి అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. అర్చన, తిరుప్పావై ఏడవ పాశుర విన్నపం పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంల్లో జరిగిన పూజల్లో భాగంగా గోదా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కానిస్టేబుల్‌కు డీజీపీ
అభినందనలు
భువనేశ్వర్: కటక్ నగర పోలీసుకు చెందిన కానిస్టేబుల్ రస్మితా సాహు క్రీడా ప్రతిభను గుర్తించి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా సోమవారం ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. ఉత్తరాఖండ్ టెహ్రీలో జరిగిన అంతర్జాతీయ ప్రెసిడెంట్ కప్ – 2025లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఒడిశా పోలీసులకు కీర్తి సాధించింది. ఈ పోటీలో రస్మితా సాహు కానోయింగ్ సి–1 1000 మీటర్ల విభాగంలో రజతం, కానోయింగ్ సి–1 500 మీటర్ల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆమెను డీజీపీ సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
రోడ్డు ప్రమాదంలో తంరడ్రీ కొడుకులకు గాయాలు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి అంబొదలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు తీవ్రగాయాలకు గురయ్యారు. క్షతగాత్రులు చంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధి గులిగుడ గ్రామానికి చెందిన గలియాదు బ్రేకబడ, అతని ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి కుచేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. గలియాదు బ్రేకబడ ద్విచక్ర వాహనంపై అంబొదల గ్రామంలో చదువుతున్న కుమార్తెను చూసేందుకు కొడకుతో వెళ్తుండగా మునిగుడ నుంచి భవానీపట్నం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని అక్కడే విడిచి పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెరగనున్న చలి తీవ్రత
పెరగనున్న చలి తీవ్రత
పెరగనున్న చలి తీవ్రత


