కూలీ మృతదేహానికి అంత్యక్రియలు
మల్కన్‌గిరి: నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి జారిపడి తీవ్రంగా గాయాలపాలై మల్కన్‌గిరి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన సతీష్‌కుమార్(22) సోమవారం మృతిచెందాడు. స్వగ్రామానికి మృతదేహం తరలించేందుకు బంధువులు రాకపోవడంతో స్థానిక సమాజ సేవకులు ముందుకొచ్చి మల్కన్‌గిరి శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. మల్కన్‌గిరి పురపాలక అధ్యక్షుడు మనోజ్‌కుమార్ బారిక్, వార్డు మెంబర్ గణేష్ సాహా, కుందన్‌కుమార్, ఎం.చంద్రరావు పర్యవేక్షించారు.


