ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
న్యూస్‌రీల్
గుణుపూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వైభవంగా ..
రాయగడ:
జిల్లాలోని గుణుపూర్‌లో ఇడితాల్ ఉత్సవాలు ఆదివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. జగన్నాథ మందిరం నుంచి ఆదివాసీ మేళ తాళాలతో, సంప్రదాయ వాయిద్యాలతో, ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాల నడుమ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలు గుణుపూర్ సేవాసమాజ్ సమీపంలోని మైదానంలో నిర్వహిస్తారు. ప్రారంభోత్సవాల్లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి జగన్నాథ మందిరంలో నిలిపారు. అనంతరం అక్కడ నుంచి కలశ యాత్ర ప్రారంభమయ్యింది. సబ్ కలక్టర్ (గుణుపూర్) దుదూల్ అభిషేక్ దిల్లిప్, మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడో, వైస్‌చైర్మన్ శివ నారాయణ గౌడో, గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజ పండ, గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగో తదితరులు కలశ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడుగడుగునా సబ్ కలెక్టర్ వాయిద్యాలను వాయిస్తూ.. నృత్యం చేస్తూ సందడి చేశారు. అనంతరం వేదిక వద్ద జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో సబ్‌కలెక్టర్ అభిషేక్ మాట్లాడుతూ.. చొయితీ ఉత్సవాలను ప్రతిఏడాది గుణుపూర్‌లో ఇడితాల్ పేరిట నిర్వహిస్తుండటం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ ప్రాంతంలోని లంజియా సవర కళలను ఇడితాల్‌గా పిలుస్తుంటారు కాబట్టి వారి సంప్రదాయాన్ని గౌరవించి ఈ ఉత్సవాలను ఇడితాల్‌గా గుర్తించి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాల్లో భాగంగా రోజూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా దివ్యదర్శన్ వారి స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం
ఇడితాల్ ఉత్సవాలు ప్రారంభం


