సెంచూరియన్ వర్సిటీలో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలోని సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో శ్రీవిద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆదివారం స్వామివారి మంగళాశాసనం, విశ్వక్షేనారాధన, వాసుదేవ పూర్ణావహాం, సుదర్శన కుంభ ప్రతిష్ట, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం, నిత్యపూర్ణాహుతి, తదితర కార్యక్రమాలను పర్లాకిమిడికి చెందిన పండితులు అనుమంచిపళ్లి రాజగోపాలాచారి, ఆచారత్వంను సరిసఖ్యాత మమాచార్యులు (శ్రీకూర్మం), అర్చకులు ఆరవెల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డీఎన్ రావు దంపతులు, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు మంగళవారం వరకూ క్యాంపస్‌లో జరుగుతాయని వర్సిటీ అధికారులు తెలియజేశారు.
సెంచూరియన్ వర్సిటీలో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్
సెంచూరియన్ వర్సిటీలో విద్యావేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్


