కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్‌రెడ్డి
గార : ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని శాంతా బయోటిక్ అధినేత పద్మభూ షణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఎన్‌ఆర్‌ఐ తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్, సంప్రదాయం డైరెక్టర్ స్వాతిసోమనాథ్, పి.సుగుణాకరరావు ఉన్నారు. కార్యక్రమంలో ఈఓ టి.వాసుదేవరా వు, అర్చకులు పాల్గొన్నారు.
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ ప్రధా న రహదారిపై కొత్తకోటవారి వీధి జంక్షన్ వద్ద ఆదివారం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం తప్పించబోయి డివైడర్‌పై ఉన్న విగ్రహం దిమ్మను ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారుడికి స్వల్ప గాయాలయ్యా యి. ఆటో పొందూరు మండలం లోలుగు నుంచి సరుబుజ్జలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెళియాపుట్టి: గొప్పిలి గ్రామంలో రైతు పిట్ట శంకరరావుకు చెందిన వరి కుప్ప కాలిపోయింది. ఆదివారం సాయంత్రం పక్కపొలంలో గడ్డికాల్చడానికి రైతు మంటపెట్టడంతో నిప్పురాజుకుంది. పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చినా పొలాల్లోకి వాహనం వెళ్లడానికి వీలు కాలేదు. గ్రామస్తులు నిప్పు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో 50 సెంట్లకు సంబంధించి సుమారు 13 బస్తాల ధాన్యం కాలిపోయింది.
పలాస: కోసంగిపురం జంక్షన్ వద్ద ఆదివారం గంజాయి తరలిస్తుండగా ఒడిశాకు చెందిన రాజేంద్ర సబార్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు కాశీబుగ్గు ఎస్‌ఐ ఆర్.నరసింహమూర్తి తెలిపారు. 10.795కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హక్కుల పరిరక్షణ కు పోరాటాలు తప్పనిసరని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ పిలుపుని చ్చారు. ఆదివారం ఏఐటీయూసీ జిల్లా 15వ మహాసభల సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని డైమండ్ పార్క్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభ ఆదివారం నిర్వహించారు. లేబర్ కోడ్‌లతో కార్మికులకు నష్టం తప్పదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, నాయకులు టి.తిరుపతిరావు, సీహెచ్ గోవిందరావు, శేషు, టి.ముత్యాలరా వు, డి.కిరణ్, వై.సూర్యనారాయణ, బి.అప్పలరాజు, లబ్బ రాజు తదితరులు పాల్గొన్నారు.
సోంపేట: క్రీడలతో పోటీతత్వం పెరుగుతుంద ని సోంపేట ఎస్‌ఐ వి.లోవరాజు అన్నారు. స్థానిక ధ్యాన్‌చంద్ స్కేటర్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం స్కేటింగ్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలు ఆదివారం నిర్వహించారు. విజేతలకు ఎస్‌ఐ చేతు ల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు టి.వెంకటరమణ, టి.ప్రణీత్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుఽలు ఎ.షణ్ముఖరావు, బి.చంద్రావతి పాల్గొన్నారు.
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి స్కూల్‌గే మ్స్ అండర్–17 బాలికల క్రికెట్ పోటీల్లో విజేతలై తిరిగిరావాలని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బీవీ రమణ ఆకాంక్షించారు. విజయవాడలో ఈ నెల 22 నుంచి జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల జట్టు ఆదివారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు.
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్‌రెడ్డి
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్‌రెడ్డి
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్‌రెడ్డి
కూర్మనాథున్ని దర్శించుకున్న వరప్రసాద్‌రెడ్డి


