పశువుల కంటైనర్ బోల్తా
40కు పైగా పశువుల దుర్మరణం
జయపురం: చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న ఒక కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న దాదాపు 40 పశువులు దుర్మరణం చెందాయి. ఈ సంఘటన శనివారం రాత్రి జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి కుమరగాం గ్రామ సమీపంలో జరిగింది. ఆ కంటైనర్‌లో 50 పశువులు రవాణ చేస్తున్నారని, వాటిలో 40 మరణించగా 10 పశువులు జీవించి ఉన్నట్లు తెలిసింది. సంఘటన జరిగిన తర్వాత కంటైనర్ డ్రైవర్ పారిపోయాడు. నేటి ఉదయం కొంత మంది స్వయం సేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) సభ్యులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కంటైనర్‌లో చిక్కుకొని ఉన్న 10 పశువులను వారు అతికష్టంతో బయటకు తీసి రక్షించారు. సమాచారం అందుకున్న కొట్‌పాడ్ తహసీల్దార్ ట్వింకిల్ సెట్టి, కొట్‌పాడ్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మరణించిన పశువులను ట్రాక్టర్ ద్వారా సమీప అడవిలో ఒక చోటికి చేర్చి వాటిపై తెల్లని కొత్త బట్టలు కప్పి పూడ్చి పెట్టారు. చట్ట వ్యతిరేకంగా పశువులను ఇతర రాష్ట్రానికి తీసుకువెళ్తున్న వ్యక్తులను, డ్రైవర్ని అరెస్టు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
పశువుల కంటైనర్ బోల్తా


