ఆకట్టుకున్న సంగీత విభావరి
పర్లాకిమిడి: అన్నమయ్య సంగీత కీర్తనలు వింటే మనసుకు ఎంతో ఆహ్లాదం కలుగుతుందని కిరణ్మయి పాఠశాల (పాతపట్నం) తిరుపతిరావు మాస్టారు అన్నారు. స్థానిక జంగం వీధి జంక్షన్‌లో సింహాద్రి అప్పన్న ఫంక్షన్ హాలులో సోమవారం లలిత సంగీత పాఠశాల పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఫ్లూట్ కళాకారుడు వెల్లంకి కూర్మనాథం ఆధ్వర్యంలో సులలిత సంగీత భారతి కార్యక్రమం నిర్వహించారు. సినీ గాయనీ, విజయనగరానికి చెందిన సురభి శ్రావణి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. తబలాపై బండారు రమణమూర్తి, కీబోర్డుపై మండా కామేశ్వరరావు, రమణ, వర్ధమాన కళాకారుడు నరేష్ తదితరులు సహకరించారు. కార్యక్రమంలో డాక్టర్ రామలక్ష్మీ, లలిత సంగీత పాఠశాల అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రవి, మరువాడ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


