సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు
రాయగడ: ఐటీ రంగంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని, దీనికి అనుగుణంగా ఆ రంగంలో విద్యాభాస్యం చేస్తున్న విద్యార్థులు నిరంతరం సాధన చేయడం ఎంతో అవసరమని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యంజయ మహాపాత్రో అభిప్రాయడ్డారు. జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జీఐఈటీ)లో ఆదివారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రాణించాలంటే ప్రతి విద్యార్థి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డాక్టర్ చంద్ర ధ్వజపండా మాట్లాడుతూ దేశం సైన్ అండ్ టెక్నాలజీ రంగంలో మరింత పురోగతి చెందాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాన్ని అధిగమించాలంటే అందుకు సాధన ఎంతో అవసరమన్నారు. పరిశోధనల ద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయని, వాటికి పదును పడితే టెక్నాలజీ రంగం మరింత ముందుకు వె వెళ్తుందన్నారు. అంతకు ముందు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఎ.వి.ఎన్.ఎల్.శర్మ స్వాగతోపన్యాసంలో భాగంగా వార్షిక నివేదికను చదివి వినిపించారు. విశ్వవిద్యాలం సాధించిన విజయాలను తెలియజేశారు.
దొరాగుడలో వైద్య శిబిరం
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి వద్ద గల దొరగుడలో ఉత్కళ అలూమిన కర్మాగారం ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబరం జరిగింది. కర్మాగారం యూనిట్ హెడ్ రవి నారాయణ మిశ్రో ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్‌ఆర్ విభాగం తరఫున చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు . కర్మాగారం ద్వాకా పరిసర గ్రామాల్లో గల ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకు గ్రామస్తుల సహకారం లభిస్తుందన్నారు. ఉత్కళ అలూమిన హస్పిటల్ సీఎంఓ డాక్టర్ రాజేంద్ర లెంక, డాక్టర్ రాజేంద్ర మండల్, సిబ్బంది ఈ శిబిరానికి హాజరైన రొగులకు వివిధ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
పేదలకు దుప్పట్లు పంపిణీ
రాయగడ: స్థానిక కళింగ వైశ్య సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు దిగజారుతున్న నేపథ్యంలో పెరుగుతున్న చలికి ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు తమ సంఘం ద్వారా దుప్పట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించామని సంఘం అధ్యక్షులు కింతలి అమర్‌నాథ్ తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండు, రైల్వేస్టేషన్, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి దుప్పట్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు


