బీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ రన్
కొరాపుట్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ రన్ పోటీలు జరిగాయి. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలో బీఎస్‌ఎఫ్ సెక్టార్ ఆవరణలో బీఎస్‌ఎఫ్ డీఐజీ సత్యవాన్ కంచి జెండా ఊపి పరుగు పందెం ప్రారంభించారు. కొరాపుట్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం పరబ్–2025 నేపథ్యంలో ఈ పోటీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 900 మంది ఈ పరుగు పందెంలో పాల్గొన్నారు. 5 కిలో మీటర్ల దూరంలో పోలీస్ గ్రౌండ్స్ వరకు ఈ పరుగు సాగింది. బాలురు, బాలికల విభాగాల్లో ప్రథమ రు.10వేలు, ద్వితీయ రు.8 వేలు, తృతీయ రు.5 వేలు నగదు పురస్కారం అందజేశారు. విజేతలకు కలెక్టర్ సత్యవాన్ మహాజన్, ఎస్పీ రోహిత్ వర్మ పురస్కారాలు అందించారు.
బీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో క్రాస్ కంట్రీ రన్


