దీర్ఘకాల సమస్యలపై చర్చ
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాల ఉత్కళ సమ్మిళిణీ శాఖల కార్యకర్తల సమావేశం ఆదివారం జయపురంలో నిర్వహించారు. ఉత్కళసమ్మిళిణీ కొ రాపుట్ జిల్లా అధ్యక్షుడు మదన మోహణ నాయిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్కళ సమ్మిళిణీ కేంద్ర కమిటీ కార్యదర్శి బిరెన్ మోహన్ పట్నాయిక్, బీజేడీ నేత బృగు బక్షీపాత్రో, రాయగడ జిల్లా అధ్యక్షులు బ్రజసుందర నాయిక్, సమ్మిళిణీ రాష్ట్ర కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు బినోద్ మహాపాత్రో తదితరులు పాల్గొని అవిభక్త కొరాపుట్ జిల్లాలు కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కనగిరిలో సమస్యలపై చర్చించారు. నాలుగు జిల్లాల ఉన్నతికి ఉత్కళ సమ్మిళిణీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అన్న దానిపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల వివాదం, వంశధార నదీ సమస్య, ఖనిజ సంపద తవ్వకాలు, విద్యా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, రైల్వే సౌకర్యాల విస్తరణ తదితర విషయాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉత్కళ సమ్మిళిణీ కేంద్ర కమిటీ నాయకత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ శాఖలు ఏర్పాటు చేసి ఉత్కళ సమ్మిళిణీని బలోపేతం చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు. 2026 ఫిబ్రవరి 28, మార్చ్ 1వ తేదీల్లో జయపురంలో ఉత్కళ సమ్మిళిణీ రెండు దినాల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఆ సమావేశానికి రాష్ట్ర మంత్రిని ఆహ్వానించాలని తీర్మానించారు. ఈ సందర్బంగా భృగు బక్షీపాత్రో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉత్కళ సమ్మిళిణీ కార్యకర్తలు అందరూ ఇక ముందు పని చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో కొరాపుట్ జిల్లా ఉత్కళ సమ్మిళినీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పరమేశ్వర పాత్రో, రాయగడ జిల్లా కార్యదర్శి అరుణ పాణిగ్రహి, కిశోర్ పండ, రాష్ట్ర కమిటీ సభ్యులు హరహర కరసుధా పట్నాయిక్, బాలా రాయ్, దుర్గా ప్రసాద్ మిశ్ర, రమాకాంత రౌళో, దేవేంధ్ర బాహిణీపతి, తేజేశ్వర పండ తదితరులు పాల్గొన్నారు.
దీర్ఘకాల సమస్యలపై చర్చ


