గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
పర్లాకిమిడి: గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో స్థానిక టౌన్ హాల్‌లో రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. శిబిరాన్నిపురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, సీడీఎంవో డాక్టర్ మహామ్మద్ ముబారక్ ఆలీ ప్రారంభించారు. రక్తదానం వల్ల ఎంతోమంది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి కాపాడకలుగుతున్నారని, ఇదొక మహోత్తర కార్యక్రమమని చైర్మన్ నిర్మలా శెఠి అన్నారు. శిబిరంలో 54 యూనిట్ల రక్తాన్ని సేకరించి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌కు తరలించారు. కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ కుమార్, గజపతి బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు గవర నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు ఎస్.రుషి, సీనియర్ ఫార్మసిస్టు ఖగేశ్వర బెహరా, కె.శరత్‌కుమార్, క్రాంతి బెహరా, సస్మితా బెహరా పాల్గొన్నారు.
గజపతి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం


