అలరించిన స్వరగానామృత లహరి
పర్లాకిమిడి: ఘంటసాల 103వ జయంతి వేడుకలు పురస్కరించుకుని చైతన్య మెలోడీస్ ఆధ్వర్యంలో రాజవీధిలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాలులో స్వరగానామృత లహరిని ఆదివారం నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 54 మంది గాయనీ గాయకులు పాల్గొని ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం, సోలో పాటలు పాడారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖఅతిథి, పాడుతా తీయగా విజేత నరసన్నపేట మండళం, గెద్దవానిపేటకు చెందిన ముద్దాడ స్వా తి, జగన్‌లకు చైతన్య మెలోడీస్ సంస్థ అధ్యక్షులు కె.చిరంజీవులు, పారిశెల్లి రామరాజు (పాతపట్నం) ఘనంగా దుశ్శాలువ, మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమాన్ని కడురమ్యంగా నిర్వహించడంలో ఉపాధ్యక్షులు కె.చిరంజీవులు, కార్యదర్శులు పి.శ్రీనివాస్ స్వామి, కె.శివకుమార్, తిరుపతిరావు, పి.మోహన్‌రావు, డాక్టర్ లీలాకృష్ణ, భుజంగరావు తదితరులు సఫలీకృతులయ్యారు.
అలరించిన స్వరగానామృత లహరి
అలరించిన స్వరగానామృత లహరి


