శాంతి పునరుద్ధరణకు చర్యలు
మల్కనగిరి: జిల్లాలోని ఎం.వి–26 గ్రామంలో శాంతిని పునరుద్ధరించేందుకు మల్కనగిరి పోలీసులు పలు కీలక చర్యలు చేపట్టారు. మహిళ హత్య ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఇందులో సంబంధం ఉన్న నిందితుడు సుకరంజన్ మండల్‌ను అరెస్టు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి చెందిన తల భాగాన్ని పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు బీఎస్‌ఎన్‌ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఏపీఎఫ్‌తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌లో శాంతి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తు ఈ కేసులో కఠినమైన చర్యలు తీసుకుంటామని మల్కనగిరి పోలీసులు హామీ ఇస్తున్నారని తెలిపారు. పౌరులు శాంతియుతంగా ఉండాలని కోరారు. సోషల్ మీడియా, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని సూచించారు. ఏమైనా స్పష్టీకరణ కోసం, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించేందుకు సమాప పోలీస్ స్టేషన్‌ను నేరుగా సంప్రదించాలని, అత్యవసర హెల్ప్‌లైన్ 112కు డయల్ చేయాలని ఎస్పీ వినోద్ పాటేల్ తెలిపారు.
శాంతి పునరుద్ధరణకు చర్యలు
శాంతి పునరుద్ధరణకు చర్యలు
శాంతి పునరుద్ధరణకు చర్యలు
శాంతి పునరుద్ధరణకు చర్యలు


