సాహిత్య సాధకుడు యతీంద్ర కన్నుమూత
మల్కనగిరి: చిత్రకొండ బ్లాక్ పరిధిలోని సోమనాథ్‌పూర్ గ్రామ పంచాయతీ కి చెందిన సీఆర్‌సీసీ యతీంద్ర స్వైయిన్ మృతి చెందా రు. గత నెల నాలుగో తేదీన చిత్రకొండ నుంచి బలిమేలకు బైక్‌పై వెళుతుండగా మంత్రిపూట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానిక ప్రజల సహాయంతో వెంటనే చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మల్కన్‌గరి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు భువనేశ్వర్ ఎయిమ్స్ తరలిస్తుండగా.. మార్గమధ్యలో బరంపురం మెడికల్ కళాశాల ఆస్పత్రి వద్ద తుది శ్వాస విడిచారు. యతీంద్ర చాల మృధుస్వభావి, స్నేహశీలి కలిగిన వ్యక్తి. ఒడియా భాష, సాహిత్యం కళ, సంస్కృతి సంప్రదాయాలను కాడాడటానికి నిరంతరం శ్రమించారు. బాలేశ్వర్ జిల్లా నీలగిరి, గొడు శూల్ కేంద్రంగా పనిచేసి వ్యాసకవి సాహిత్య సంపద్, బాలిమేలా గురుప్రియ సాహిత్య సంసద్ సంస్థలను స్థాపించారు.


