కేంద్రీయ విద్యాలయంలో హైస్పీడ్ ఇంటర్‌నెట్ సేవలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల కేంద్రీయ విద్యాలయంలో హైస్పీడ్ ఇంటర్‌నెట్ సేవలు కల్పించేందుకు సబ్ కలెక్టర్, కేంద్రీయ విద్యాలయం పరిచాలన కమిటీ అధ్యక్షులు దుదూల్ అభిషేక్ అనిల్ అన్నారు. గురువారం నాడు ఈ మేరకు విద్యాల యంలో నిర్వహించిన కమిటీ సమావేశంలొ ఆయన పాల్గొని సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. విద్యార్థులకు నాణ్యత గల విద్యను అందించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ గురించి ఆయన ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు వివరించారు. అదేవిధంగా త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా, విద్యార్థులకు తరచూ వైద్య పరీక్షలను నిర్వహించ డం వంటి వాటిపై చర్చించారు. విద్యాలయానికి సంబంధించి భవణ నిర్మాణం పనులు మరో ఏడా దిలో పూర్తవుతాయని సబ్ కలెక్టర్ వివరించారు. పరిచాలన కమిటీ సభ్యులు అక్షయకుమార్ దాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాలయంలో పదకొండో తరగతి ప్రారంభించాలని సూచించారు. విద్యాలయం ప్రిన్సిపాల్ సౌరభ్ జైన్, సభ్యులు ఉమాచరన్ పట్నాయక్, లక్ష్మీణ్ సబర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


