టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ పోలీసు బందోబస్తు
భువనేశ్వర్: ఈ నెల 9న కటక్‌లోని బారాబటి స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కటక్, భువనేశ్వర్ జంట నగరాల కమిషనరేట్ పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ఆటగాళ్లు, ప్రముఖులు, ప్రేక్షకుల భద్రత, వాహనాల రవాణా క్రమబద్ధీకరణ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. తొమ్మిది మంది అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, 40 మంది డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు, 65 మంది ఇన్‌స్పెక్ట ర్లు, 325 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 38 మంది హవాల్దార్లు, కానిస్టేబుళ్లు, 208 మంది ఏపీఆర్ కానిస్టేబు ళ్లు, 73 మంది మహిళా కానిస్టేబుళ్లు, 1 యూనిట్ ఒడ్రాఫ్, 2 యూనిట్ల ఎస్టీయూ, 70 ప్లాటూన్ పోలీ స్ దళాలను బారాబటి స్టేడియం, ట్రాఫిక్ వ్యవస్థ భద్రత కోసం మోహరించనున్నారు.
భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు ఈ నెల 7వ తేదీన భువనేశ్వర్ చేరుకుంటాయి. రెండు జట్లు మర్నాడు 8వ తేదీన కటక్ బారాబటి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తాయి. 9వ తేదీన ప్రధాన మ్యాచ్ జరుగుతుంది. విమానాశ్రయం, క్రికెటర్లు, అధికారులు తదితర ప్రముఖులు బస చేసే హోటళ్లు, బారాబటి స్టేడియం, భువనేశ్వర్ నుంచి కటక్ వరకు ఆటగాళ్ల రాకపోకలు చేసే వరకు అన్ని ప్రదేశాలలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, వెలుపల సజావుగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపా లు జరగకుండా చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ఆదేశించారు.
టికెట్ల అమ్మకం
శుక్ర వారం ఉదయం 10 గంటల నుండి టికెట్ల అమ్మకం ప్రారంభమైంది. కాసేపట్లో టికెట్లు అమ్ము డుపోయాయి. భారతీయ ఆటగాళ్లను దగ్గరగా చూడటానికి ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్ల అమ్మకాల కేంద్రం దగ్గర రద్దీ నియంత్రణతో టిక్కెట్ల అమ్మకం క్రమబద్ధీకరణ కోసం పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కటక్ నగర డీసీపీ ఖిలారి రిషికేశ్ ద్యాండేయో అధ్యక్షతన బారాబటి స్టేడియం ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్‌ను క్రమబద్ధంగా నిర్వహించాలని ఖిలారి పోలీసు అధికారు లు, సిబ్బందిని ఆదేశించారు. వేలాది మంది క్రీడాభిమానులు గుమిగూడే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎగబాకిన జనం
టికెట్ల కొనుగోలు కోసం ఉదయం నుంచే క్రికెటు అభిమానులు ఎగబాకారు. వాస్తవానికి ఉదయం 6 గంటలకు ముందు టికెట్ల కోసం బారులు తీరేందుకు అనుమతించేది లేదని పోలీసు యంత్రాంగం ముందస్తుగా చేసిన ప్రకటనలు నీరు గారిపోయా యి. శుక్రవారం వేకువ జాము నుంచే టికెట్ల కొనుగోలు కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 10 గంటలకు 10 కౌంటర్లు తెరిచి టికెట్లు విక్రయించారు.
టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ పోలీసు బందోబస్తు
టీ–20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ పోలీసు బందోబస్తు


