త్వరలో పాఠ్యపుస్తకాలు మార్పు
భువనేశ్వర్: త్వరలో పాఠ్యపుస్తకాలు మారుతా యి. ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు కొత్త పుస్తకాలు చదువుతారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మారుతాయి. పాఠ్యపుస్తకాల మార్పిడి కోసం ప్రభు త్వం సన్నాహాలు చేస్తుంది. కొత్త పాఠ్యపుస్తకా ల తయారీ ప్రక్రియ దశలవారీగా జరుగుతుందని సామూహిక విద్యా విభాగం మంత్రి తెలిపారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహానా నియోజకవర్గం అడవ పోలీసుస్టేషన్ పరిధిలో కేసరిగుడ పంచాయతీ తుమంగ్ పదర్ ఏజన్సీలో జాయింట్ ఆపరేషన్ చేపట్టి పది ఎకరాలలో అక్రమంగా పండిస్తున్న గంజాయి క్షేత్రాన్ని పోలీసులు, అటవీ, ఎకై ్సజ్ సిబ్బంది నాశనం చేశారు. గంజాయి క్షేత్రంలో 20 వేలకుపైగా ఏపుగా పెరిగిన మొక్కలను యంత్రాలతో ధ్వంసం చేసి దగ్ధం చేసినట్టు జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు.
● రూ.3 లక్షలతో ఉడాయించిన
దుండగులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని దత్తాత్రేయ ఆశ్రమం సమీపంలో బైక్ షోరూం వద్ద గుర్తు తెలియని ముగ్గురు అగంతకులు ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడి బ్యాగును కోసేసి రూ.3 లక్షలతో ఉడాయించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు..
నగరంలోని బొందిలీపురం శివరాంనగర్ కాలనీకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు సక్కరి సత్యగోపి వైద్యారోగ్య శాఖలో పనిచేసి రిటైరయ్యారు. తన భార్యకు ఎచ్చెర్ల పరిధిలోని వెంకటాపురం కూడలి సమీపంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఖాతా ఉండటంతో లాకర్‌లో డబ్బులు, బంగారం దాచుకున్నారు. ఏడాది క్రితం రూ.4 లక్షలు లాకర్‌లో వేశారు. ఆ మొత్తం తీసి శ్రీకాకుళం ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచిలో వేసేందుకు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బ్యాంకుకు వెవెళ్లిన వృద్ధుడు బ్యాగులో నగదు భద్రపరిచాడు. అనంతరం వెంకటాపురం కూడలిలో డేఅండ్‌నైట్ వైపు వస్తున్న ఆటోఎక్కాడు. మార్గమధ్యలో మరో ముగ్గురు ఎక్కి బ్యాగును చాకచక్యంగా కోసేసి కేటీఎం షోరూం వద్ద దిగి వెవెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు చూడగా రూ.లక్ష మా త్రమే కనిపించడంతో వృద్ధుడు ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు పోలీసుల ను ఆశ్రయించారు. ఆటోవాలాను విచారించామని, అతని ప్రమేయమేమీ లేదని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.
వజ్రపుకొత్తూరు: ఉద్దానం తీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న కార్గో ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తామని, రైతుల పొట్టకొట్టే పరిస్థితి ఉండదని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఎయిర్‌పోర్టు స్పెషల్ ఆఫీసర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పలాస ఆర్డీఓ జి.వెంకటేష్‌తో కలిసి విలేకరుల తో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాది అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని కార్గో ఎయిర్‌పోర్టులో 11ది అవుతుందన్నారు. 1200 ఎకరాలు భూ సేకరణకు నిర్ణయించామని, ఇందులో ప్రభుత్వ భూమి 200 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. రైతుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమికి జిరాయితీ భూమితో సమానంగా పరిహారం అందిస్తామన్నారు. గ్రామాల కు ముప్పు లేనందున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించదని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర కన్నా రెండున్న రెట్లు పరిహారం అందిస్తామని, ల్యాండ్ పూలింగ్ పథకం ఎంచుకుంటే విలువైన భూములు ఎయిర్‌పోర్టు చుట్టూ ఉన్న ఏరియాలో ఇస్తామన్నారు. త్వరలో ఎయిర్‌పోర్టు ప్రభావిత గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. మెట్టురు పంచాయతీ నుంచి 150 ఎకరాలు, చీపురుపల్లి పంచాయతీ నుంచి 317 ఎకరాలను రైతులు నుంచి సేకరిస్తామని వివరించారు. సమావేశంలో వి.వి.సీతారామ్మూర్తి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బూర్జ: థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కార్యదర్శి సవర సింహాచలం హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం అన్నంపేట పంచాయతీ జె.వి.పురం గిరిజన గ్రామంలో పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి ప్రతులను దహనం చేశారు. సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. కార్యక్రమంలో పోరాట కమిటీ సభ్యులు సవర నాగేష్, సింగయ్య, సింహాచలం, గోపాలరావు, బుగ్గన్న, తాతయ్య, మోజేష్, కల్లేపల్లి సింహాచలం, సీడ్ ప్రకాష్ పాల్గొన్నారు.


