ఎమ్మెల్యేపై గ్రామస్తుల ఆగ్రహం
భువనేశ్వర్: గ్రామస్తుల ఆగ్రహానికి ఎమ్మెల్యే తలొగ్గిన పరిస్థితి శుక్రవారం వెలుగు చూసింది. భువనేశ్వర్‌కు వెళ్తుండగా కంటాబంజి నియోజక వర్గం ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. నిత్యం గ్రామస్తులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఎమ్మెల్యే ప్రత్యక్షంగా అనుభవించి తీరాల్సిందేనని నిలదీశారు. కాలువపై వంతెన లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు వర్ణణాతీతమైన వెతలకు లోనవుతున్నారు. ఇది దైనందిన సమస్యగా పరిణమించింది. కెరాండి కాలువపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ పొండకిమల్ వద్ద గ్రామస్తులు రహదారి దిగ్బంధం చేసి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో 15 గ్రామాల ప్రజలు టైర్లు తగలబెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆ మార్గం గుండా భువనేశ్వర్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్‌ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. జాతీయ రహదారి గుండా కాకుండా కాలువ దాటుకుంటు ముందుకు సాగాలని పట్టుబట్టారు. గ్రామస్తులను బుజ్జగించి వారి సమస్యల చిట్టాని లిఖితపూర్వకంగా స్వీకరించి గ్రామస్తుల పట్టు ప్రకారం కాలువ గుండా ముందుకు సాగారు. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కారం చేపడతానని ఎమ్మెల్యే ఆందోళనకారులకు హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేపై గ్రామస్తుల ఆగ్రహం
ఎమ్మెల్యేపై గ్రామస్తుల ఆగ్రహం


