గుమ్మ బ్లాక్‌లో ఏనుగుల సంచారం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుమ్మా బ్లాక్‌లో పోరిడా, గైబ పంచాయతీలు అడంగుడ, జన్నిగుడ ప్రాంతంలో నాలుగు అటవీ ఏనుగులు సంచరిస్తూ పంట పొలాలు, అరటి తోటలు నాశనం చేస్తున్నాయి. వరిపంట కోతకు వచ్చిన సమయంలో ఏనుగుల వల్ల పంటనష్టం అవుతున్నా గ్రామస్తులు ఏమీ చేయలేక పోతున్నారు. అయితే వాటిని రెచ్చగొట్టవద్దని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందని అటవీ రేంజ్ అధికారి బ్రహ్మానంద సాహు చెబుతున్నారు. గత మూడు రోజులుగా ఈ ఏనుగులు గుమ్మ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు.


