అపహరణ కేసులో నిర్దోషిగా విడుదల
రాయగడ: అపహరణ, లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కేసును విచారించిన జిల్లా అదనపు జడ్డి (పోక్సో) శ్వేత మిశ్రో నిర్దోషిగా తీర్పునిచ్చారు. బుధవారం ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే 10 మంది సాక్షులను విచారించిన పిదప ఈ మేరకు తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 22, 2019వ సంవత్సరంలో స్థానిక మంగళ మందిరం సమీపంలో నివసిస్తున్న ఒక వ్యక్తి తన కూతురుని రవీశ్వర్ అనే వ్యక్తి అపహరించి లైంగిక వేధింపులు చేశాడంటూ సదరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రవీశ్వర్ పువలాను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసును విచారించిన అదనపు జడ్డి ఈ మేరకు నిందితుడు నిర్దోషిగా పరిగణిస్తూ తీర్పునిచ్చారు.
నిరంతర జీవన శైలిపై ఎగ్జిబిషన్
జయపురం: సబ్ డివిజన్ పరిధిలోని బొయిపరిగుడ నోడల్ ఉన్నత పాఠశాలలో నిరంతర జీవన శైలిపై గురువారం ఎగ్జిబిషన్ నిర్వహించారు. సమితిలోని 19 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని 50కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. వాటిలో ఉత్తమ ప్రదర్శనలను న్యాయ నిర్ణేతలు నోడల్ స్కూల్ ఉపాధ్యాయిని స్నిత రాణి బాగ్, మహుళి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఉమాకాంత జువాడీలు ఎంపిక చేశారు. వాటిని జిల్లాస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల్లో చంద్రపడ ఆదర్శ ఉన్నత పాఠశాల విద్యార్థి జస్వీర సింగ్ ప్రథమ స్థానం, ఆదర్శ విద్యాలయ విద్యార్థిని ఆరాధ్య చర్చి ద్వితీయ స్థానం, నోడల్ విద్యాలయ విద్యార్థి పూరజ్ హంతాల్ తృతీయ స్థానంలో నిలిచారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నోడల్ హైస్కూల్ ఎనర్జీ బ్లాక్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.
ఇళ్ల పట్టాల పంపిణీ
రాయగడ: జిల్లాలోని గుడారిలో 65 మంది లబ్ధిదారులకు కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. బుధవారం గుడారిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుడారి తహసీల్దార్ ఎ.స్నేహలత, ఆర్‌ఐ ప్రసాద్ నిమలపాల్గొన్నారు.
శ్రీజగన్నాథ మందిర
పునఃప్రతిష్ట హుండీ లెక్కింపు
పర్లాకిమిడి: స్థానిక శ్రీజగన్నాథ స్వామి మందిర పునఃప్రతిష్ట కోసం ఆవరణలో ఏర్పాటు చేసిన భక్తుల విరాళాల హుండీని గురువారం లెక్కించారు. మొత్తం రూ.9లక్షల 45వేల 590 లు వచ్చినట్టు కమిటీ కార్యదర్శి దుర్గామాధవ పాణిగ్రాహి తెలియజేశారు.
పర్యాటక బస్సుకు తప్పిన ప్రమాదం
పర్లాకిమిడి: గజపతి జిల్లా మహేంద్రగిరి పర్వతానికి భువనేశ్వర్ ఉత్కళ యూనివర్సిటీ విద్యార్థులు బస్సులో వెళ్లి పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం కించిలింగి గ్రామం అర్సిలింగి ఘట్ మలుపు వద్ద అదుపు తప్పి బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయితే బస్సు లోయలోకి పడిపోకుండా పక్కకు ఉండిపోవడంతో అపాయం నుంచి తప్పించుకున్నారు. గారబంద ఐఐసీ ప్రశాంత్ కుమార్ నిషిక సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో బయటకు తీసి సురక్షితంగా తిరిగి వారిని తరలించారు.
అపహరణ కేసులో నిర్దోషిగా విడుదల
అపహరణ కేసులో నిర్దోషిగా విడుదల
అపహరణ కేసులో నిర్దోషిగా విడుదల


