గోమాంసంతో ఇద్దరు అరెస్టు
జయపురం: పట్టణ పోలీసులు గోమాంసంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిపై గోహత్య నేరం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సదర్ పోలీసుస్టేషన్ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు. అరైస్టెనవారు స్థానిక క్రిస్టియన్ పేట ప్రాంతానికి చెందిన పింటు నాగ్, అమిత్ నాగ్‌లుగా వెల్లడించారు. కొత్తవీధి సమీపంలోని చెరువు వద్ద ఉదయం ఐదుగురు వ్యక్తులు గో మాంసం కోస్తుండగా చూచిన కొందరు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ముగ్గురు పారిపోయారని మిగతా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారని పోలీసు అధికారి వెల్లడించారు. వారు చంపి కోస్తున్న ఆవు కొత్తవీధికి చెందిన రబీ నాయిక్ అనే వ్యక్తిది అని తెలిసిందన్నారు. సంఘటన స్థలంలో గోమాంసంతో పాటు ఆవుని చంపేందుకు వినియోగించిన గొడ్డలి, ఆవు చర్మం ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
గోమాంసంతో ఇద్దరు అరెస్టు
గోమాంసంతో ఇద్దరు అరెస్టు


