రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:15 AM

రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో రెవెన్యూ సర్వీసుల సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీరాములు, బి.వి.ఎన్‌.ఎస్‌.రాజు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌ యూనిట్‌, శ్రీకాకుళం డివిజన్‌ యూనిట్‌, టెక్కలి డివిజన్‌ యూనిట్‌, పలాస డివిజన్‌ యూనిట్ల మూడేళ్ల కాల పరిమితి ముగిసినందున 2025 – 28 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గం ఎన్నుకునేందుకు బధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్‌, కలెక్టర్‌ యూనిట్‌ల ఎన్నికలు ఈ నెల 21న జరగనున్నాయని తెలిపారు.

ప్రత్యేక అవసరాల పిల్లలపై దృష్టి సారించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. అంతర్జాతీయ ప్రత్యేక విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని బెహరా మనోవికాస్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సందర్శనలో భాగంగా హరిబాబు కేంద్రంలోని చిన్నారులందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ జి.ఇందిరాప్రసాద్‌, సంస్థ నిర్వాహకులు శేఖర్‌, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

విస్తృతంగా ఎకై ్సజ్‌ అధికారుల దాడులు

కొత్తూరు: అంధ్ర – ఒడిశా సరిహద్దు గ్రామల్లో రెండు రాష్ట్రాలకు చెందిన ఎకై ్సజ్‌ అధికారులు బుధవారం విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 6,050 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు స్థానిక ఎకై ్సజ్‌ సీఐ కిరణ్మీశ్వరి తెలిపారు. అంధ్ర, ఒడిశా రాష్ట్రాల జాయింట్‌ రైట్స్‌లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో, ఒడిశా రాష్ట్రం సరిహద్దు గ్రామాలైన కొత్తగూడ, నడుము గూడ గిరిజన గ్రామాల్లో దాడులు చేపట్టారు. దాడుల్లో శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ మురళీధర్‌, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన కొత్తూరు, పొందూరు, పాలకొండ, రాజాం, పార్వతీపురం, ఆమదాలవలస, శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రం గుణుపూర్‌కు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

ట్రక్‌ షీట్లు జనరేట్‌ కావడం లేదు

సారవకోట: రైతులు కల్లాలు లేకపోవడంతో సమీపంలో ఉన్న మిల్లుల ఆవరణలో ధాన్యం ఆరబెట్టుకుని, అక్కడే మిల్లర్లకు ధాన్యం అందిస్తున్నారని అటువంటి ట్రక్‌ షీట్లు జనరేట్‌ కావడం లేదని అవలింగికి చెందిన రైతు బోర ధనుంజయ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలోని బుడితి రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో పలు సమస్యలపై చర్చించారు. ట్రక్‌షీట్లు జనరేట్‌ కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో నిక్కు కృష్ణారావు, బోర శ్రీరామమూర్తి, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి మృతదేహం లభ్యం

పాతపట్నం: మండలంలో కోదూరు గ్రామ సమీపంలోని కొండ పక్కన కాపు గోపాలపురం గ్రామానికి చెందిన మతి స్థిమితం లేని వృద్ధుడు తడక లక్ష్మీనారాయణ (84) మృతదేహం లభ్యమైనట్లు ఏఎస్‌ఐ కె.శ్రీరామమూర్తి బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కాపుగోపాలపురం గ్రామానికి చెందిన వృద్ధుడు తడక లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదు. ఇంటి నుంచి మూడు రోజులకు ఒకసారి వెళ్లిపోయి, మళ్లీ ఇంటికి రావడం అలవాటుగా ఉండేది. అందులో భాగంగానే నవంబర్‌ 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు బుధవారం కోదూరు గ్రామ సమీపంలోని కొండ వద్ద మృతదేహం గ్రామస్తులు గుర్తించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి కుమారుడు తడక దాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ తెలిపారు.

 రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం 
1
1/2

రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం

 రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం 
2
2/2

రెవెన్యూ అసోసియేషన్‌ ఎన్నికలకు సిద్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement