విభిన్న ప్రతిభావంతులను గౌరవిద్దాం
పర్లాకిమిడి: విభిన్న ప్రతిభావంతులను గౌరవించాలని ఇన్‌చార్జి కలెక్టర్, ఏ.డి.ఎం. మునీంద్ర హానగ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సమాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాల నుంచి అవగాహన ర్యాలీ చేపట్టారు. వ్యాంగులు, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐదుగురు దివ్యాంగులకు సంక్షేమ పథకం కింద రూ.2.50 లక్షల చెక్కులను అందజేశారు. ఐదుగురు దివ్యాంగులకు నెలసరి భృతి, ఇద్దరు విద్యార్థినులకు ఉన్నతవిద్య భృతి, ఇద్దరికి వీల్ చైర్లను జిల్లా పరిషత్ ఆదనపు కార్యనిర్వాహణ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, సబ్ కలెక్టర్ అనుప్ పండా అందజేశారు. మూగ, బధిరులకు వక్తృత్వ, డ్రాయింగ్, క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. శ్రీజగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విభిన్న ప్రతిభావంతులను గౌరవిద్దాం
విభిన్న ప్రతిభావంతులను గౌరవిద్దాం
విభిన్న ప్రతిభావంతులను గౌరవిద్దాం


