ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Dec 4 2025 9:06 AM | Updated on Dec 4 2025 9:06 AM

ఉల్లా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

పర్లాకిమిడి: స్థానిక డోలా ట్యాంకు రోడ్డు గజపతి నగర్‌లో ఉన్న మహిళా ఉన్నత విద్యామండలి నాల్గో వార్షిక క్రీడా పోటీలు బుధవారం ప్లస్‌ టు కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మహీంద్ర రైతా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీల్లో వంద మీటర్ల రన్నింగ్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, జువెలిన్‌ థ్రో, కబడ్డీ, గోణె సంచుల గంతులు, షార్ట్‌ఫుట్‌ వంటి ఈవెంట్లను పీఈటీ బిజయలక్ష్మీ పండా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఆటల పోటీలకు ప్లస్‌ టు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుందని ప్రిన్సిపాల్‌ మహేంద్ర రయిత తెలియజేశారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..1
1/1

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement