శ్రామిక్ కాంగ్రెస్ ఓపెన్ లైన్ శాఖ కొత్త కార్యవర్గం
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఓపెన్ లైన్ శాఖ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గ సభ్యులకు శ్రామిక్ కాంగ్రెస్ ప్రముఖులు ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యదర్శి లక్ష్మి ధర మహంతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు పి.రాజారావు అధ్యక్షత వహించగా మండల సమన్వయకర్త సునీల్‌కుమార్ భంజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కార్యవర్గం: అధ్యక్షునిగా మహ్మద్ ముస్తాక్ ఆలీ, కా ర్యనిర్వాహక అధ్యక్షునిగా పి.రాజారావు, ఉపాధ్యక్షులుగా ఫకీర్ చరణ్ నాయక్, జి.రామమోహనరావు, శాఖ కార్యదర్శిగా లక్ష్మీధర మహంతి, సహాయ కార్యదర్శులుగా త్రిలోచన్ మహంతి, రాకేష్ కుమార్ ఘొడై, ప్రదీప్ కుమార్ సుందరరాయ్, త్రిలోచన్ బెహరా, సంస్థాగత కార్యదర్శులుగా బి.టి.రావు, సునీల్ కుమార్ పరిడా, కోశాధికారిగా ప్రదీప్ కుమార్ పండా నియమితలవ్వగా.. సంతోష్ కుమార్ ఖొటై, అశోక్ కుమార్ భోలా, నిత్యానంద పండా, నరేంద్ర కుమార్ దాస్, సంతోష్ కుమార్ దొలై శాఖ సలహాదారులుగా వ్యవహరిస్తారు.


