అవగాహనే ఎయిడ్స్‌కు మందు
జయపురం: అవగాహనే ఎయిడ్స్ మహమ్మారికి మందు అని స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయ జాతీయ సేవా యోజన బ్యూరో చీఫ్ డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ అన్నారు. వర్సిటీలోని హ్యూమానిటీ సెమినార్ హాల్‌లో జాతీయ సేవా యోజన విభాగం వారు నిర్వహించిన హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిపిన్‌సిల్‌లపై నిర్వహించిన సెమినార్‌లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జీవితంలో ప్రాణాంతకమైన హెచ్‌ఐవీ సంక్రమించకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లెప్రా ఇండియా ప్రతినిధి విజ్ఞానిక దాస్, సహిద్ లక్ష్మణ నాయిక్ మెడికల్ కళాశాల ఐసీటీసీ కౌన్సిలర్ మనశ్విణీ టక్రి ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. జాతీయ సేవా యోజన జయపురం విభాగ పురుష విభాగ కార్యనిర్వాహక అధికారి లోకేస్ ప్రధాన్, మహిళా విభాగ కార్యనిర్వాహక అధికారిణి సుకాంతి సాయె శిబిరాన్ని పర్యవేక్షించారు. ఎయిడ్స్ నియింత్రపై విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.
అవగాహనే ఎయిడ్స్‌కు మందు


