జయపురం: పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాల తొలగింపు కొనసాగుతోంది. మహాత్మాగాంధీ రోడ్డు, 26వ జాతీయ రహదారి పక్కన అనేక దుకాణాలను శుక్రవారం తొలగించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల వలన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వేద్బార్ ప్రధాన్ శుక్రవారం ప్రారంబించారు. సబ్ రిజిస్ట్రార్‌గా కలిమెల తహసీల్దార్ రామకృష్ణ సత్య రాజగురుకు బాధ్యతలు అప్పగించారు. ప్రజలు ఇకపై తమ తహసీల్ పరిధిలోనే భూమి రిజిస్ట్రేషన్, భూమి అమ్మకాలు, కొనుగోళ్లు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతీ మంగళ, బుధవారాల్లో రిజిస్ట్రేషన్ పనులు జరుగుతాయని వెల్లడించారు.
ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు పరిశీలన
రాయగడ: స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి కపిలాస్ కూడలి వరకు అనుసంధానించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతు పనులను రాయగడ ఎంఎల్‌ఏ అప్పలస్వామి కడ్రక పరిశీలించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మతులు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బ్రిడ్జిపై పాదచారుల దారి (ఫుట్ వే), రైలింగ్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పనులను గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టరుతో మాట్లాడి నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని సూచించారు. కొన్నాళ్లుగా బ్రిడ్జి మరమ్మతులకు గురికావడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసింది. పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.
ప్రమాదకర వంతెనపై ప్రయాణం
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. రల్లేగేఢ పంచాయతీ కాంటాగూడ గ్రామవాసులకు రహదారి సదుపాయం కూడా లేదు. ఇక్కడి జలాశయంలో నాటుపడవలపైనే ఒకప్పుడు రాకపోకలు సాగించేవారు. మావోయిస్టుల చెర వీడాక 2016 లో ఈ ప్రాంతంలో గురుప్రియ వంతెన నిర్మించారు. అయితే కాంటాగుడ గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేదు. కర్రలతో నిర్మించుకున్న వంతెనపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. వర్షం పడితే గ్రామానికే పరిమితమవుతున్నారు. ఇక్కడ 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పిల్లలకు స్కూల్ లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. అంతా ఆవులు మేపుకుంటున్నారు. అంబులెన్స్ కూడా రావడం లేదు.
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు
కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు


