వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు
పర్లాకిమిడి: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శనివారం స్థానిక గజపతి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ మధుమతి తెలియజేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో పాలనాధికారితో పాటు జిల్లా పరిషత్, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శంకర్ కెరకెటా, అదనపు ఈవో పృ థ్వీరాజ్ మండల్, సీడీఎంఓ డాక్టర్ ఎంఎం అలీ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక కళాకారులచే ప్రదర్శనలు, స్వయం శక్తి గ్రూపులు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, విద్యార్థులకు అనేక పోటీలు ఉంటాయన్నారు.


