రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
కొరాపుట్: రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి చెందగా.. మరో ఇద్దరు ఫారెస్టర్ల పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి కేంద్రానికి సమీపంలో నిర్మితమవుతున్న విశాఖపట్నం – రాయ్‌పూర్‌ల మధ్య ఉన్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారతమాలపై ప్రమాదం జరిగింది. జొరిగాం ఫారెస్టర్ గుప్త ప్రసాద్ మహంతి (55), ఉమ్మర్‌కోట్ ఫారెస్టర్ కామాక్ష్య ప్రసాద్ స్వయ్, జొరిగాంకి చెందిన మరో ఫారెస్టర్ తనుజ కుమార్ పరిచ్చాలు కారులో వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక పికప్ వ్యాన్ కారును ఢీకొంది. దీంతో ఘటనా స్థలంలో గుప్త ప్రసాద్ మృతి చెందగా.. మరో ఇద్దరు ఫారెస్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పపడాహండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖపట్నం తరలించారు. పపడాహండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. భారతమాల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రజల వినియోగంలోకి తీసుకొస్తామని గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇది వరకే ప్రకటించారు. అయినప్పటికీ వాహనదారులు ప్రారంభం కానీ మార్గంలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ప్రమాదానికి గురైన వాహనం
రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఫారెస్టర్ మృతి


