పత్తి పొలంలో జవాన్ మృతదేహం
రాయగడ : ఒడిశా ఆర్మ్‌డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ జవాన్ మృతదేహాన్ని సదరు సమితి పరిధిలోని పితామహల్ పంచాయతీ జిమిడిపేట సమీపంలో గల పత్తి పొలాల్లో శేశిఖాల్ పోలీసులు గురువారం గుర్తించారు. పంట పొలంలో మృతదేహం పడిఉండటం గమనించిన ఆ ప్రాంతవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాయగడ ఎస్‌డీపీఓ గౌర హరి సాహు తెలియజేసిన వివరాల ప్రకారం చందిలి పోలీస్ వెనుక గల రిజర్వ్ పోలీస్ విభాగంలో జవానుగా విధులు నిర్వహిస్తున్న గౌరి ప్రసాద్ తాడింగి (45) మృతదేహంగా తమ దర్యాప్తులో తేలిందని, అయితే పూర్తి వివరాలు కొసం దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.
12 కిలోల గంజాయి స్వాధీనం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సబ్ డివిజన్ రామనగుడ సమితి పరిధిలో గల బంకి కూడలి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 12 కిలోల గంజాయిని రామనగుడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఐఐసీ సునీత బెహరా ఆదేశానుసారం పోలీసులు బంకి కూడలి వద్ద వాహన తనిఖీలను బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఆపి తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
లక్ష్మీ అమ్మవారికి వెండి కిరీటం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల జగన్నాథ మందిరం ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ అమ్మవారికి కొత్తగా వెండితో రూపొందించిన కిరీటాన్ని అలంకరించారు. సుమారు 1100 గ్రాములు గల వెండితో రూపొందించిన కిరీటం ఆకర్షిస్తోంది. మరో 700 గ్రాములతో రూపొందించిన 108 వెండి పద్మపూలను కూడా అలంకరించారు.
219 మంది దివ్యాంగులకు పరీక్షలు
పర్లాకిమిడి: స్థానిక టౌను హాల్‌లో దివ్యాంగుల సమర్థ శిబిరాన్ని జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వసస్థీకరణ విభాగం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శిబిరాన్ని పురపాలక చైర్మన్ నిర్మలా శెఠి, సబ్ డివిజనల్ సామాజిక సురక్ష అధికారి లక్కోజు సంతోష్ కుమార్, పురపాలక వైస్ చైర్మన్ లెంక మధు తదితరులు ప్రారంభించారు. దీనిలో భాగంగా నేత్రాలు, చెవి, ముక్కు, నోరు, ఎంఆర్, ఆర్థోపెడిక్ వంటి విభాగాల్లో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. 219 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. వారిలో 168 మందిని యూనిక్ డిజాబిలిటీ (ప్రత్యేక దివ్యాంగులు)గా అధికారులు గుర్తించారు. శిబిరంలో ప్రభుత్వ ఆస్పత్రి అర్థోపెడిక్ డాక్టర్ శంతను పాడి తదితరులు పాల్గొన్నారు.
పత్తి పొలంలో జవాన్ మృతదేహం
పత్తి పొలంలో జవాన్ మృతదేహం
పత్తి పొలంలో జవాన్ మృతదేహం


