జఖపురాలో గతి శక్తి కార్గో టెర్మినల్
భువనేశ్వర్ : రాష్ట్రంలో సరుకు రవాణా మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుసంధానం ప్రోత్సాహానికి తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్ డివిజన్ జఖపురాలో కొత్త గతి శక్తి కార్గో టెర్మినల్ (జీసీటీ) ప్రారంభించారు. జాజ్‌పూర్ జిల్లాలో ఇది మైలురాయి ప్రాజెక్టుగా నిలుస్తుంది. రూ. 36.85 కోట్లు వెచ్చించి 4 లైన్ల టెర్మినల్ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఇది సిమెంట్, క్లింకర్, స్లాగ్, జిప్సమ్ రవాణాలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టెర్మినల్ నెలకు దాదాపు 86 ర్యాక్‌లను నిర్వహించగలదని భావిస్తున్నారు. 86 ర్యాక్‌ల్లో సిమెంట్, అనుబంధ పరిశ్రమలకు ముడి పదార్థాలు, ఉత్పాదకతల తరలించడంలో శక్తివంతమైన వ్యవస్థగా వెలుగొందుతుందని రైల్వే శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ జీసీటీ ప్రారంభం వల్ల సరుకు రవాణా నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. ఈ రంగంలో నిరంతర, నిత్య, దైనందిన ఖర్చులు తగ్గుతాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక సరఫరా గొలుసు బలోపేతం అవుతుంది. రైల్వేలు, స్థానిక ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ప్రయోజనం చేకూర్చుతుంది.


