విగతజీవిగా యువకుడు
మల్కన్‌గిరి: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి ఇర్మాగూడ గ్రామానికి చెందిన లలిన్ మాడి కాలువలో తన బైక్‌తో పాటు మృతదేహమై మంగళవారం సాయంత్రం కనిపించాడు. అయితే ఇది హత్య అని ఫిర్యాదు రావడంతో మల్కన్‌గిరి ఐఐసీ రీగాన్‌కీండో హత్య కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన యువకుడు కొన్ని గంటల్లో కాలువలో శవమై కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడపై తీవ్రమైన కత్తిగాట్లు ఉండడంతో ఇది హత్యగా భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విగతజీవిగా యువకుడు


