భక్తులు రావొద్దు
కొరాపుట్: మోంథా తుఫాన్‌పై కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కొరాపుట్ జిల్లా నందపూర్ మార్గంలో చెట్టు కూలింది. బొయిపరిగుడ సమితి దండకారణ్యంలోని సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంను మూసి వేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈనెల 30వ తేదీ వరకు భక్తులు రావద్దని ప్రకటించారు. చరిత్రలో కరోనా సమయంలో తప్ప ఏనాడూ మూసివేయని గుప్తేశ్వరం మూసివేయడం గమనార్హం. అలాగే లమ్తాపుట్ సమితిలోని ప్రఖ్యాత డుడుమా జలపాతం ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసివేశారు. ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో ఐదుగురు గర్భిణులను కొండ గ్రామాల నుంచి కొఠియా ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొరాపుట్ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసింది. కొరాపుట్ – జగదల్‌పూర్‌ల మధ్య అన్ని రకాలు రైల్వే సర్వీసులు రద్దు చేశారు.


