న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
భారీ వానలు..
పర్లాకిమిడి: మోంథా ప్రభావంతో గజపతి జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్.ఉదయగిరి, మోహన, నువాగడ ప్రాంతాల్లో గర్భిణులను, కొండలపై నివసిస్తున్న ప్రజలను తుఫాన్ షెల్టర్లు, ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తున్నారు. కలెక్టర్ మధుమిత రాయగఢ, ఆర్.ఉదయగిరి, కాశీనగర్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలు, స్థలాలను కలెక్టర్ పలు ప్రభుత్వ శాఖల ద్వారా సేకరించారు. ప్రస్తుతానికి సోమవారం నుంచి బుధవారం వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక కళాశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేసింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు ఇలా ఉన్నాయి.
మల్కన్‌గిరిలో రెడ్ అలర్ట్
వుల్కన్గిరి : జిల్లాలోని మోంథా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మల్కన్‌గిరి కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో సెలవులు పరిస్థితిని సమీక్ష నిర్వహించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సైక్లోన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లాలో 11 అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ఇతర జిల్లాల నుంచి మూడు ఓడ్రాఫ్ టీమ్‌లు, ఒక ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్ అందుబాటులో ఉంచారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని భావించి ఇతర జిల్లాల నుంచి విద్యుత్ సిబ్బందిని పిలిపించారు. నదీ తీర ప్రాంతాలపై దృష్టి పెట్టారు.
కొఠియాను తాకిన తుఫాన్
కొరాపుట్: తుఫాన్ కొటియాని తాకింది. సోమవారం సాయంత్రం ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొటియాలో వర్షం ప్రారంభమైంది. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొటియా తడిసి ముద్దయ్యింది. సరిహద్దు ఆంధ్రా నుంచి భారీ మేఘాలు వచ్చి చుట్టుముట్టాయి. కొండ ప్రాంతాల గ్రామాల ప్రజలు ఇళ్లకి పరిమితమయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం దేవమాలి నిర్మానుష్యంగా మారింది. కొండ దిగువ ప్రాంతంలో పర్యాటకులను స్థానికులు వారించి వెనక్కి పంపిస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు


