దొంగతనాల్లో నిందితుల అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసు స్టేషన్, మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన దొంగతనాల్లో నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.5లక్షలు నగదు, ఒక యమహా ఎంటీ బైక్, ఒక టాటా టైగర్ కారు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టయిన నిందితులు జయపురం ఇరిగేషన్ కాలనీ శాంతిరాజ్ నాగ్ ఉరఫ్ రాహుల్(19), జయనగర్ నివాసి అభినాష్ మహరాణ ఉరఫ్ ఆకాశ్ (28) లు అని వెల్లడించారు. గత ఏప్రిల్ 15న జయపురం హనాగుడ నివాసి రాధామోహణ పట్నాయిక్ ఫిర్యాదు చేశారని, అతడి ఫిర్యాదులో 14వ తేదీ రాత్రి కొంత మంది దుండగులు తన పక్కింటిలో దొంగతనం చేసి బంగారు, వెండి నగలతో పాటు రూ.10 వేలు దొంగిలించారని పేర్కొన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా రాహుల్ అతడి సహచరుడు ఆకాష్‌లు దొంగతనం చేశారని గుర్తించామన్నారు. వారు బంగారు నగలను కె.మురళి అనే బంగారు వ్యాపారికి రూ.50 వేలకు అమ్మినట్లు వెల్లడించారు. వారిని అరెస్టు చేసి విచారించగా మల్కన్‌గిరిలో కూడా దొంగతనం చేసినట్లు రాహుల్ వెల్లడించాడని, గత జూన్ నెలలో రాహుల్, ఆకాష్‌లు తమ సహచరులు రాజు నాయిక్, భరత్ నాయిక్, అజయ్, కె.సుమన్ ఆచారిలతో ప్రసాద్ జ్యుయలరీ షాపులో బ్యాగ్‌లో ఉంచిన దాదాపు 1.2 కిలోల బంగాను నగలు దొంగిలించారని, అనంతరం చిత్రకొండ పారిపోయారని, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లారని అక్కడ నుంచి వారు బంగాను నగలు అమ్మేందుకు ఎస్.వెంకటేష్, కె.మురళి లను సంప్రదించారని, అయితే వాటిని అమ్మటం సాధ్యం కాదని తెలుసు కొని వారు విజయనగరం వచ్చి ఒక మెల్టింగ్ మిషన్ కొని బంగారు నగలు కరిగించారని అందులో కొంత బంగారం అమ్మారని, మిగతా బంగారం తర్వాతఅమ్మేందుకు ఉంచారని వెల్లడించారు. సీజ్ చేసిన నగదు, వాహనాలను మల్కన్‌గిరి పోలీసులకు అప్పగిస్తామని వెల్లడించారు.
36.ఎ. అరెస్టయిన ఇద్దరు దొంగలు
36.బి. దొంగల వద్ద పట్టుబడిన రూ.5 లక్షల నగదు
36.సి . దొంగతనాలకు వారు వినియోగించే కారు, బైక్‌లు
దొంగతనాల్లో నిందితుల అరెస్టు
దొంగతనాల్లో నిందితుల అరెస్టు


