
గుణుపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
● రెడీమేడ్ వస్త్ర దుకాణం దగ్ధం
● లక్షలాది రూపాయల ఆస్తి నష్టం
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ పాతబస్టాండ్ సమీపంలో ఉన్న అయ్యప్ప రెడీమేడ్ బట్టల షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువచేసే రెడీమేడ్ వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడి వారు కొందరు అగ్ని ప్రమాదానికి సంబంధించి షాపు యజమానికి, అదేవిధంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. గుణుపూర్, గుమడల అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది శకటాలతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో మూపో అంతస్తులో నలుగురు వ్యక్తులు చిక్కికుపోవడంతో వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి కిందకు సురక్షింతంగా దించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

గుణుపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం