జయపురం: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమం నెలకొల్పినట్లు వనవాసీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్ లక్ష్మీకాంత మిశ్ర వెల్లడించారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఒడిశా, రమేష్‌చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ సహకారంతో బుధవారం జయపురం సమితి కుంద్ర సమితి ఇందుగుడ, బొయిపరిగుడ సమితి నందనమాలా గ్రామాల్లో ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రాంతీయ కో ఆర్డినేటర్ రతికాంత సాహు భారతీయ వనవాసీ కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ ఆశ్రమం జిల్లా అధ్యక్షుడు బాలాజీ బెహరా, జయపురం పట్టణ అధ్యక్షుడు శశిభూషణ పట్నాయిక్, కొరాపుల్ జల్లా కో–ఆర్డినేటర్ దుర్జోధన బిశాయి, బికాశ చంద్ర చౌధురి, ప్రభుదాన్ పొరజ, ప్రఫుల్ల బిశాయి, ప్రతాప్ పట్నాయిక్, లోకనాథ నాయిక్, సునామణి నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల అభివృద్ధే ‘వనవాసీ’ లక్ష్యం