
● ఇద్దరు అరెస్టు.. 12 తుపాకులు స్వాధీనం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ డంబగుడ పంచాయతీ గోలపాజు గ్రామంలో నాటు తుపాకులు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 నాటు తుపాకులు, యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ జ్యోతింద్ర పండా మోహనా పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గోలపాజు గ్రామంలో గణశ్యాం ప్రధాన్, హరిశ్చంద్ర మల్లిక్‌లు అక్రమంగా నాటు తుపాకులు తయారుచేసి గంజాం, గజపతి, కంధమాల్, బౌధ్ జిల్లాలకు రవాణాచేస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సబ్‌డివిజనల్ పోలీసు అధికారి సురేష్ కుమార్ త్రిపాఠి, మోహనా ఠానా ఐఐసీ బంసత కుమార్ శెఠి, హవిల్దారు ప్రశాంత పలక తదితరులు పాల్గొన్నారు.

● ఇద్దరు అరెస్టు.. 12 తుపాకులు స్వాధీనం