
ఘనంగా శిశు మహోత్సవం
జయపురం: జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయ పరిధి కుంత్రర్‌కాల్ సాధన కేంద్ర ఓజెయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం శిశు మహోత్సవం సురభి 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంతర్‌కాల్ కమ్యూనిటీ సాధన కేంద్రం కో–ఆర్డినేటర్ రుద్రప్రసాద్ పాణిగ్రహి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఒడిశా ప్రాథమిక విద్య డైరెక్టరేట్ అధికారి రంజన్‌కుమార్ రథ్, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన్‌కుమార్ నాయిక్, ఒడిశా రాష్ట్ర నాన్‌గెజిటెడ్ కర్మచారి సమన్వయ కమిటీ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు శిశిభూషణ్ దాస్, ఎడ్యుకేషన్ విభాగాఽధికారి రాజేంద్ర నారాయణ పాఢీ, ప్రభుత్వ కమ్యూనిటీ విద్యాధికారి కె.గోపాలరావు, ప్రభుత్వ కమ్యూనిటీ విద్యాధికారి సోమనాథ్ గదబ, సురేంద్రకుమార్ పట్నాయిక్, పి.హరిశ్చంద్రరావు పాల్గొన్నారు.

ఘనంగా శిశు మహోత్సవం