
పాముకాటుతో వృద్ధురాలి మృతి
రాయగడ: పాముకాటుతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హటోమునిగుడ పంచాయతీ గొంటిఖాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలు సాలహుయిక (60)గా గుర్తించారు. తన సొంత పొలంలో వ్యవసాయం పనులు చేస్తున్న సమయంలో పాము కాటుకు గురైన ఆమెను కుటుంబీకులు వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాలని సూచించారు. అదేమీ పట్టించుకోకుండా కుటుంబీకులు కరాపాడి గ్రామంలోని ఒక మత్రం వేసే వారి ఇంటికి తీసుకువెళ్లారు. మూఢనమ్మకాల కారణంగా ఆమెకు సకాలంలో మెరుగైన చికిత్స అందకపొవడంతో ప్రాణాలు కోల్పోయింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు
భువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద్ గోండ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణ వెల్లువెత్తాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం నువాపడా నర్సింగ్ శిక్షణ కళాశాలలో రాజకీయ కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా విపక్ష బిజూ జనతా దళ్ ఆరోపించింది. ఈ మేరకు బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి కలిసి మంత్రి నిత్యానంద్ గోండ్‌పై వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది.

పాముకాటుతో వృద్ధురాలి మృతి